Chikoti Praveen: బీఆర్ఎస్ పెద్దల అండతో రాధాకిషన్ రావు అరాచకాలు చేశాడు.. నా ఫోన్ కూడా ట్యాప్ చేశాడు: డీజీపీకి చికోటి ప్రవీణ్ ఫిర్యాదు

Chikoti Praveen complaint to dgp against radhakishan rao
  • తనపై పీడీ యాక్ట్ కేసు పెడతానని బెదిరించినట్లు వెల్లడి
  • తన ఫోన్‌ను ట్యాపింగ్ చేసి తన కదలికలపై నిఘా పెట్టారని ఆవేదన
  • రాధాకిషన్ రావు చాలామంది జీవితాలను నాశనం చేశాడని మండిపాటు
బీఆర్ఎస్ పెద్దల అండతో రాధాకిషన్ రావు అరాచకాలు చేశారని, తన ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేశారని చికోటి ప్రవీణ్ కుమార్ మంగళవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ... తనపై పీడీ యాక్ట్ కేసు పెడతానని బెదిరించారని ఆరోపించారు. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేసి తన కదలికలపై నిఘా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాధాకిషన్ రావు చాలామంది జీవితాలను నాశనం చేశాడన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ నివేదికలో కీలక అంశాలను పోలీసులు పొందుపరిచారు. వారిద్దరూ తమ నేరాలను అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అలాగే విచారణలో ప్రణీత్ రావు కీలక వివరాలు వెల్లడించినట్లు పోలీసులు వెల్లడించారు.
Chikoti Praveen
TS DGP
Phone Tapping Case

More Telugu News