T Congress: కేసీఆర్.. నువ్వు ప్రతి పల్లెకు రావాల్సిందే: టీ కాంగ్రెస్

KCR you should come to every village says T Congress
  • ఏనాడూ రైతు గోడు వినని కేసీఆర్ ను పరుగులు పెట్టించామన్న కాంగ్రెస్
  • నీ దొంగ మాటలను నమ్మేవాళ్లు లేరని ఎద్దేవా
  • ప్రజల మధ్యకు వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వ్యాఖ్య
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా సెటైర్లు వేసింది. పదేళ్ల పాలనలో ఏనాడూ రైతు గోడు వినని, రైతు గోస పట్టనోడిని పరుగులు పెట్టించి... ఫామ్ మౌస్ లో విలాసాలే తప్ప పరామర్శలు తెలియనోడిని ప్రజల మధ్యకు వచ్చేలా చేసిందని... ఇది కాదా కాంగ్రెస్ తెచ్చిన మార్పు? అని వ్యాఖ్యానించింది. 

చంపినోడే సంతాపం తెలిపినట్టు... పదేళ్లలో ఎనిమిది వేలకు పైగా రైతులను పొట్టన పెట్టుకుని, ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారిస్తే, సానుభూతి నాటకాలాడితే నీ దొంగ మాటలను ఇంకా నమ్మేవాళ్లు ఎవరూ లేరు కేసీఆర్ అని ఎద్దేవా చేసింది. తెలంగాణలోని ప్రతి పల్లెకు నీవు రావాల్సిందేనని... నువ్వు చేసిన పాపాలకు ప్రజల మధ్యకు వచ్చి పశ్చాత్తాప పడాల్సిందేనని, ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని చెప్పింది.
T Congress
KCR
BRS
TS Politics

More Telugu News