కచ్చతీవు దీవిని శ్రీలంకకు ఇచ్చేసింది.. కాంగ్రెస్ పై మోదీ ఫైర్
- 1974లో ఇందిరా గాంధీ ఈ దీవిని లంకకు కట్టబెట్టిందంటూ ట్వీట్
- ప్రతీ భారతీయుడికీ ఈ విషయం కోపం తెప్పిస్తుందన్న మోదీ
- దేశ ప్రయోజానాల విషయంలో కాంగ్రెస్ ను నమ్మలేమని వ్యాఖ్య
భారతదేశ ఐకమత్యాన్ని, సమగ్రతతను, ప్రయోజనాలను 75 ఏళ్లుగా కాంగ్రెస్ దూరం చేస్తూనే ఉందన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ పార్టీని నమ్మలేమని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ట్వీట్ చేశారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన ఆర్టీఐ దరఖాస్తుతో కచ్చతీవు దీవుల విషయం వెలుగులోకి వచ్చింది. 1974 జూన్ లో కచ్చతీవు దీవులపై పూర్తి హక్కులను శ్రీలంకకు అప్పగిస్తున్నట్లు అప్పటి తమిళనాడు సీఎం కరుణానిధికి విదేశాంగ శాఖ కార్యదర్శి కేవల్ సింగ్ సమాచారం అందించినట్లు వెల్లడైంది.