Pithani Balakrishna: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన జనసేన నేత పితాని బాలకృష్ణ

Pithani Balakrishna joins YSRCP
  • ముమ్మడివరం జనసేన ఇన్ఛార్జీగా వ్యవహరించిన పితాని
  • మేమంతా సిద్ధం బస్సు యాత్రలో వైసీపీలో చేరిక
  • వైసీపీలో చేరిన కళ్యాణదుర్గం టీడీపీ నేతలు

కోనసీమ జిల్లా ముమ్మడివరంకు చెందిన పలువురు జనసేన నేతలు వైసీపీలో చేరారు. ముమ్మడివరం జనసేన పార్టీ ఇన్ఛార్జీగా వ్యవహరించిన పితాని బాలకృష్ణతో పాటు డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ సానబోయిన మల్లికార్జున్ సహా పలువురు నేతలు వైసీపీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కర్నూలు జిల్లా తుగ్గలి వద్ద వీరు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు కళ్యాణదుర్గం టీడీపీ ఇన్చార్జీ ఉమామహేశ్వర నాయుడు, ఆయన మద్దతుదారులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం జగన్ బస్సు యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. కాసేపటి క్రితమే గుత్తిలో రోడ్ షో ముగిసింది.

  • Loading...

More Telugu News