Chandrababu Naidu: ఇదీ అసలు కథ.. ఇదే పరదా వెనుక దాగున్న కథ: చంద్రబాబు

TDP President Nara Chandrababu Naidu Tweet on CM Jagan Bus Tour
  • సీఎం జ‌గ‌న్‌ 'మేమంతా సిద్ధం' బ‌స్సు యాత్ర‌కు క‌ర్నూల్ జిల్లాలో నిర‌స‌న సెగ  
  • గూడూరు మండ‌లం కొత్తూరుకు చెందిన మ‌హిళ‌లు ఖాళీ బిందెల‌తో జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌కు అడ్డు ప‌డిన వైనం
  • ఈ విష‌య‌మై 'ఎక్స్' వేదిక‌గా స్పందించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 
'మేమంతా సిద్ధం' పేరిట ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ‌స్సు యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ బ‌స్సు యాత్ర‌లో భాగంగా క‌ర్నూల్ జిల్లాలో సీఎం జ‌గ‌న్‌కు నిర‌స‌న సెగ త‌గిలింది. త‌మ తాగునీటి స‌మ‌స్య తీర్చాలంటూ గూడూరు మండ‌లం కొత్తూరుకు చెందిన మ‌హిళ‌లు ఖాళీ బిందెల‌తో జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌కు అడ్డు ప‌డ్డారు. దీనిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎక్స్ (ట్విట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. 'ప్రజలారా 5 ఏళ్ల పరదాలకు అర్థం తెలిసిందా? ఇదీ అసలు కథ! ఇదే పరదా వెనుక‌ దాగున్న కథ' అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు జ‌గ‌న్ యాత్ర‌కు అడ్డుప‌డ్డ వార్త తాలూకు క్లిప్‌ను జోడించారు.
Chandrababu Naidu
CM Jagan
YSRCP
TDP
AP Politics

More Telugu News