IPL 2024: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులోకి కేశ‌వ్ మ‌హరాజ్ రాయ‌ల్ ఎంట్రీ అదుర్స్‌.. వీడియో వైర‌ల్!

Rajasthan Royals Unveil Keshav Maharaj As He Joins Squad To Replace Prasidh Krishna for IPL 2024
  • ల‌క్నో సూప‌ర్ జెయింట్స్  నుంచి రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు కేశ‌వ్ మ‌హరాజ్
  • గాయంతో టోర్నీకి దూర‌మైన ప్ర‌సిద్ధ్ కృష్ణ స్థానంలో ద‌క్షిణాఫ్రికా స్పిన్న‌ర్‌ను తీసుకున్న ఆర్ఆర్‌
  • కొత్త ఆట‌గాడికి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికిన‌ రాజ‌స్థాన్ జ‌ట్టు
ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ఫ్రాంచైజీ రాజ‌స్థాన్ రాయ‌ల్ (ఆర్ఆర్) త‌మ జ‌ట్టులో కొత్త ఆట‌గాడు కేశ‌వ్ మ‌హారాజ్ చేరిన విష‌యాన్ని ఓ స్పెష‌ల్ వీడియో ద్వారా తెలియ‌జేసింది. కాగా, ఎడ‌మ‌చేతి స్పిన్న‌ర్ అయిన ఈ ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్‌ను దుబాయి వేదిక‌గా జ‌రిగిన వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌లేదు. అయితే, గ‌త సీజ‌న్‌లో ఆడిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) మ‌రోసారి అత‌డిని బేస్ ధర రూ.50 ల‌క్ష‌ల‌కు తిరిగి తీసుకుంది. దాంతో గ‌త కొన్నిరోజులు ఆ జ‌ట్టుతో క‌లిసి ప్రాక్టీస్ సెష‌న్‌ల‌లో కూడా పాల్గొన్నాడు. 

అయితే, ఇప్పుడు అనూహ్యంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అదే ధ‌ర‌కు కేశ‌వ్ మ‌హరాజ్‌ను త‌మ జ‌ట్టులోకి తీసుకుంది. గాయంతో టోర్నీకి దూర‌మైన ప్ర‌సిద్ధ్ కృష్ణ స్థానంలో అత‌డిని తీసుకుంది. దాంతో ఈ దిగ్గ‌జ స్పిన్న‌ర్ తాజాగా ఆర్ఆర్ జ‌ట్టుతో చేరాడు. ఈ సంద‌ర్భంగా రాజ‌స్థాన్ ఫ్రాంచైజీ కేశ‌వ్ మ‌హారాజ్‌కు స్వాగ‌తం ప‌లుకుతూ ఓ ప్ర‌త్యేక‌మైన వీడియోను రూపొందించింది. ఈ వీడియోను త‌న అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. వీడియోలో పింక్ బ్లేజ‌ర్‌, త‌ల‌కు ఎర్ర‌టి ట‌ర్బ‌న్‌, నుదు‌టన తిల‌కంతో కేశ‌వ్ మ‌హరాజ్ మెరిసిపోయాడనే చెప్పాలి. 'న‌మ‌స్తే.. రాయ‌ల్‌గా ఉండ‌టం మ‌హరాజ్‌కే సాధ్య‌మ‌వుతుంది..' అని కేశ‌వ్ మ‌హరాజ్ చెప్ప‌డం వీడియోలో ఉంది. ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
IPL 2024
Rajasthan Royals
Keshav Maharaj
Prasidh Krishna
Cricket
Sports News

More Telugu News