KTR: హన్మకొండలో మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు!

A Case filed against KTR in Hanamkonda
  • సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
  • శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్న‌ కాంగ్రెస్ నేతలు 
  • కేటీఆర్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన హన్మకొండ పోలీసులు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై హన్మకొండలో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు హన్మకొండ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత‌ల ఫిర్యాదుతో హన్మకొండ పోలీసులు కేటీఆర్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News