Container: ఆ కంటైనర్ సీఎం జగన్ బస్సు యాత్రలో ఆహారం తయారుచేసే వాహనం: వైసీపీ వివరణ

YCP clarifies on container entered in CM camp office
  • సీఎం క్యాంపు కార్యాలయం వద్ద కంటైనర్ కలకలం
  • పలు సందేహాలు వ్యక్తం చేసిన విపక్ష నేతలు
  • ప్రభుత్వ శాఖలకు ఫర్నిచర్ తెచ్చిందని వైవీ సుబ్బారెడ్డి వివరణ
  • వైవీ వ్యాఖ్యలకు విరుద్ధంగా స్పందించిన వైసీపీ... అది పాంట్రీ వాహనం అని వెల్లడి

సీఎం జగన్ క్యాంపు ఆఫీసులో ప్రవేశించిన కంటైనర్ వాహనం ప్రభుత్వ శాఖలకు ఫర్నిచర్ తీసుకువచ్చిందని వైవీ సుబ్బారెడ్డి చెప్పగా, వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో మరో రకంగా వివరణ ఇచ్చింది. సీఎం జగన్ బస్సు యాత్ర సందర్భంగా దారిలో ఆహారం తయారు చేసే పాంట్రీ వాహనం అని వెల్లడించింది. ఆ పాంట్రీ వాహనం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వస్తే, ఆ వాహనంపై రామోజీ పచ్చమీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. అంతేకాదు, వైసీపీ ఓ వీడియో కూడా పంచుకుంది. ఆ కంటైనర్ వాహనంలో ఏముందో కూడా వీడియోలో చూపించారు.

  • Loading...

More Telugu News