KTR: దానం నాగేందర్ పై అనర్హత కోసం సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం: కేటీఆర్

KTR demands disqualification of Danam Nagender
  • ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ లో చేరారని కేటీఆర్ మండిపాటు
  • దానంను స్పీకర్ అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్
  • పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రావడం గొప్ప కాదని వ్యాఖ్య

బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ అన్నారు. గెలిపించిన ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ లో చేరారని విమర్శించారు. మూడు నెలల్లోనే ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక వస్తుందని చెప్పారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ను గెలిపించి, దానం నిర్ణయాన్ని తప్పని నిరూపిస్తారని అన్నారు. 

దానం నాగేందర్ పై అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశామని... ఫిర్యాదుపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దానంను అనర్హుడిగా ప్రకటించాలని అన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లైనా సరే దానంను అనర్హుడిగా ప్రకటించేలా చేస్తామని చెప్పారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రావడం, ఉండటం ముఖ్యం కాదని... పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండే నాయకుడే నిజమైన నాయకులవుతారని అన్నారు. ఓటు వేసిన కార్యకర్తలను దానం వెన్నుపోటు పొడిచారని, పార్టీ మారి ఆయన తప్పు చేశారని అన్నారు. 

  • Loading...

More Telugu News