KTR: కవితను అరెస్ట్ చేయలేదని కాంగ్రెస్ ప్రచారం చేసింది... ఇప్పుడు ఇంటికే వచ్చి ఈడీ తీసుకెళ్లింది: కేటీఆర్

KTR responds on kavitha arrest and congress leaders comments
  • బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే కాబట్టి ఈడీ కవితను అరెస్ట్ చేయలేదని అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నారన్న కేటీఆర్
  • కాంగ్రెస్ ప్రచారాన్ని హైదరాబాద్ ప్రజలు మాత్రం నమ్మలేదని వ్యాఖ్య
  • మోదీని రాహుల్ గాంధీ చౌకీదార్ అంటే... రేవంత్ రెడ్డి బడే భాయ్ అంటున్నారని విమర్శ
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే కాబట్టి ఈడీ కవితను అరెస్ట్ చేయలేదని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం చేసిందని, కానీ ఇప్పుడు ఈడీ నేరుగా ఇంటికి వచ్చి కవితను తీసుకువెళ్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మన పార్టీ బీజేపీకి బీ టీమ్ అని కాంగ్రెస్ బాగా ప్రచారం చేసిందని గుర్తు చేశారు. అందుకే కవితను అరెస్ట్ చేయలేదని కూడా విమర్శలు చేసిందన్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారాన్ని హైదరాబాద్ ప్రజలు మాత్రం నమ్మలేదన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలన్నింటినీ అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు. ప్రధాని మోదీని రాహుల్ గాంధీ ఏమో చౌకీదార్ అంటుంటే... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేమో బడే భాయ్ అంటున్నారని విమర్శించారు.
KTR
Telangana
BRS
BJP
K Kavitha

More Telugu News