పురందేశ్వరిని కలిసిన మంద కృష్ణ మాదిగ

MRPS chief meets Purandeswari after pledging support to NDA
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలిశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పురందేశ్వరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 35 డిమాండ్లతో కూడిన మెమోరాండంను పురందేశ్వరికి అందించారు. ఈ డిమాండ్లలో ఎస్సీ వర్గీకరణ కూడా ఉంది. ఎస్సీల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంద కృష్ణకు పురందేశ్వరి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు కూడా కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఏపీలో ఎన్డీయేకు పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా పురందేశ్వరికి మంద కృష్ణ హామీ ఇచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
Go Back to Shorts
Manda Krishna Madiga
MRPS
Daggubati Purandeswari
BJP

More Telugu News