విజయవాడ వెస్ట్ నియోజకవర్గంపై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
- విజయవాడ వెస్ట్ నియోజకవర్గంపై ఎన్టీయే కూటమి కుట్రలు చేస్తోందన్న కేశినేని నాని
- టికెట్ బీసీలకు కాకుండా బీజేపీ తరపున ఓ బిజినెస్ మేన్ కు ఇస్తున్నారని విమర్శ
- జగన్ చెప్పినట్టు ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్నాయని వ్యాఖ్య
పేదలు ఉన్న నియోజకవర్గంలో ధనికులకు టికెట్ ఇస్తున్నారని కేశినేని నాని దుయ్యబట్టారు. తమ అధినేత సీఎం జగన్ చెపుతున్నట్టు ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. గెలిచే సత్తా లేక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెరతీస్తున్నారని విమర్శించారు. విజయవాడ వెస్ట్ సీటు ఎప్పటికీ బీసీలు, మైనార్టీలదేనని... గతంలో తన కూతురు విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తానంటే వద్దని తాను బహిరంగంగా చెప్పానని తెలిపారు.