ఎన్నికల కోడ్ కు ఒక్కరోజు ముందు 17 వేల ఎకరాల పందేరం: దేవినేని ఉమ
- హడావుడిగా 4 జీవోలు జారీ చేసిన జగన్ సర్కారు
- అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా భూముల ధారాదత్తం
- సీఎం జగన్ పై మండిపడ్డ టీడీపీ నేత దేవినేని ఉమ
కేవలం ఒక్క కంపెనీకే ఐదేళ్లలో 25 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టారని దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. సరిగ్గా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే ముందు రోజు ప్రభుత్వం హడావుడిగా నాలుగు జీవోలు జారీ చేసిందని చెప్పారు. ఇండోసోల్ అనే కంపెనీకి ఒక్కరోజే ఏకంగా 17 వేల ఎకరాలను లీజుకు ఇచ్చారని, ఎకరాకు ఏడాదికి రూ.31 వేలకు ఇచ్చారని దేవినేని ఉమ పేర్కొన్నారు. ఒక ట్రాన్స్ ఫార్మర్ల కంపెనీకి రూ.47 వేల కోట్ల విద్యుత్ రాయితీ కల్పించారని ఆరోపించారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టి అడ్డదారుల్లో సొంత సంపదగా మార్చుకుంటున్నాడని సీఎం జగన్ పై దేవినేని మండిపడ్డారు.