KCR: రంగంలోకి కేసీఆర్.. ఉగాది తర్వాత రోడ్‌షోలతో జనంలోకి

KCR Ready For Road Shows And Corner Meetings Ahead Of Lok Sabha Polls
  • లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న కేసీఆర్
  • రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లకు ప్రణాళిక
  • హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీకాంత్!
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తున్నారు. హైదరాబాద్ మినహా అభ్యర్థుల ఎంపికను పూర్తిచేసిన బీఆర్ఎస్ అధినేత ఉగాది తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు బహిరంగ సభలకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన కేసీఆర్ ఈసారి మాత్రం రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లలో పాల్గొనాలని నిర్ణయించినట్టు తెలిసింది. మొత్తం 17 నియోజకవర్గాలను చుట్టేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలోకి వెళ్లడం ద్వారా ప్రజలకు దగ్గర కావడంతోపాటు క్యాడర్‌‌లోనూ ఆత్మస్థైర్యం నింపేందుకే కేసీఆర్ రోడ్‌షో నిర్ణయం తీసుకున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 17 లోక్‌సభ స్థానాలకు గాను 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ హైదరాబాద్ స్థానాన్ని పెండింగులో పెట్టారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీకాంత్‌ హైదరాబాద్ అభ్యర్థిగా దాదాపు ఖరారైనప్పటికీ అధికారికంగా ప్రకటించాల్సి ఉందని సమాచారం.
KCR
BRS
Road Show
Corner Meeting
Lok Sabha Polls
Telangana

More Telugu News