Kesineni Nani: హైదరాబాద్ నుంచి నా ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారు: కేశినేని నాని

Chandrababu is tapping my phone says Kesineni Nani
  • ఫోన్లు ట్యాప్ చేయించడం చంద్రబాబుకు అలవాటేనన్న కేశినేని నాని
  • కేశినేని చిన్ని నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని విమర్శ
  • త్వరలోనే పుస్తకం వస్తుందని వ్యాఖ్య

ఫోన్లు ట్యాపింగ్ చేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటేనని వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. ఏబీ వెంకటేశ్వరరావుతో ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. తన ఫోన్ ను ప్రధాని మోదీ ట్యాపింగ్ చేయించారని గతంలో చంద్రబాబు ఆరోపించారని... ఇప్పుడు అదే మోదీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. తన ఫోన్ ను 2018 నుంచి ట్యాప్ చేస్తున్నారని... తన ఫోన్ ను ట్యాప్ చేసినా తనకేం భయం లేదని చెప్పారు. తన ఫోన్ ను ట్యాప్ చేయించాల్సిన అవసరం సీఎం జగన్ కు లేదని చెప్పారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి తన ఫోన్ ను ట్యాప్ చేయిస్తున్నారని మండిపడ్డారు. 

ఇదే సమయంలో విజయవాడ లోక్ సభ స్థానంలో తనపై పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి, తన సోదరుడు కేశినేని చిన్నిపై నాని విమర్శలు గుప్పించారు. టీడీపీ అభ్యర్థి నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని అన్నారు. ఆయన నేర చరిత్ర, భూ కబ్జాలపై త్వరలో పుస్తకాలు వస్తాయని చెప్పారు. విశాఖలో డ్రగ్స్ తెప్పించింది చంద్రబాబు సన్నిహితులే అని అన్నారు. దేవినేని ఉమా చాప్టర్ క్లోజ్ అయిందని... ఆయన స్థానాన్ని చంద్రబాబు రూ. 100 కోట్లకు అమ్మేశారని ఆరోపించారు. 

  • Loading...

More Telugu News