Chandrababu: ఎంత ఆవేదన చెందితే ఇలా ప్రాణాలు తీసుకుంటారో తెలుసా?: సీఎం జగన్ ను నిలదీసిన చంద్రబాబు

Chandrababu take a jibe at CM Jagan after a family committed suicide in Kadapa district
  • ఉమ్మడి కడప జిల్లాలో ఓ చేనేత కుటుంబం ఆత్మహత్య
  • కబ్జారాయుళ్లతో పోరాడలేక బీసీ కుటుంబం ప్రాణాలు తీసుకుందన్న చంద్రబాబు
  • వైసీపీ నేతల కబ్జాకాండ నిండు కుటుంబం ఉసురు తీసిందని విమర్శలు
  • సొంత జిల్లాలో జరిగిన ఘటనపై జగన్ తక్షణమే స్పందించాలని డిమాండ్
ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఓ చేనేతకారుడి కుటుంబం బలవన్మరణం చెందిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. 

ప్రభుత్వ దాష్టీకానికి ఓ చేనేత కుటుంబం బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల కబ్జాకాండ నిండు కుటుంబం ఉసురు తీసిందని మండిపడ్డారు. కబ్జారాయుళ్లతో పోరాడలేక బీసీ కుటుంబం ప్రాణాలు తీసుకుందని చంద్రబాబు పేర్కొన్నారు. మాటలకందని విషాదం ప్రతి ఒక్కరినీ ఆందోళనలో పడేస్తోందని తెలిపారు.

ఒంటిమిట్ట మండలం మాధవరంలో జరిగిన ఈ ఘటనకు సీఎం ఏం చెబుతారు? అంటూ ప్రశ్నించారు. ఎంత ఆవేదన చెందితే ఇలా ప్రాణాలు తీసుకుంటారో తెలుసా? అని నిలదీశారు. సొంత జిల్లాలో జరిగిన ఘటనపై జగన్ తక్షణమే స్పందించాలని, ఆత్మహత్య ఘటనకు బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Chandrababu
Madhavaram
Jagan
TDP
YSRCP
Kadapa District

More Telugu News