Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి

Director SV Krishna Reddy met Chief Minister Shri Revanth Reddy
  • నిర్మాత అచ్చిరెడ్డితో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన దర్శకుడు
  • మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్వీ కృష్ణారెడ్డి
  • పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపిన నిర్మాత, దర్శకుడు
ప్రముఖ సినీ నిర్మాత అచ్చిరెడ్డి, టాలీవుడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డిలు శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వారు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి పలువురు సినీ ప్రముఖులు ఆయనను కలుస్తున్నారు. గతంలో టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ, నిర్మాత దిల్ రాజు తదితరులు కలిశారు.
Revanth Reddy
SV Krishna Reddy
Tollywood

More Telugu News