Manchu Vishnu: టాలీవుడ్ 90 ఏళ్ల వేడుకలు మలేసియాలో నిర్వహిస్తాం: 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు

Manchu Vishnu said Telugu Film Industry 90 Years celebrations will be organised in Malaysia
  • 90 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ
  • జులైలో మలేసియా వేదికగా ఉత్సవాలు జరుపుతామన్న మంచు విష్ణు
  • సినీ పెద్దలతో మాట్లాడి తేదీలు ప్రకటిస్తామని వెల్లడి
తెలుగు సినీ ఇండస్ట్రీ 90 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, మలేసియాలో అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహించనున్నామని 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు వెల్లడించారు. జులైలో టాలీవుడ్ 90 ఏళ్ల ఉత్సవాలు జరుపుతామని, అందరూ హాజరయ్యేందుకు వీలుగా షూటింగులకు 3 రోజులు సెలవులు ఇవ్వాలని కోరామని, దీనిపై ఫిలిం చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సానుకూలంగా స్పందించారని మంచు విష్ణు తెలిపారు. 

తెలుగు చలన చిత్ర పరిశ్రమ వైభవాన్ని, ప్రతిష్ఠను చాటేందుకే ఈ వేడుకలు జరుపుతున్నామని, ఈ వేడుకల ద్వారా నిధుల సేకరణ కూడా చేపడుతున్నామని, ఆర్థిక సమస్యల్లో ఉన్న 'మా' సభ్యులకు ఆ నిధులు అందిస్తామని వెల్లడించారు. 

టాలీవుడ్ 90 ఏళ్ల వేడుకలు ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై ఇండస్ట్రీ పెద్దలో మాట్లాడతామని, వారి ఆశీస్సులు కూడా అందుకుని తేదీలు ప్రకటిస్తామని మంచు విష్ణు పేర్కొన్నారు.
Manchu Vishnu
Tollywood
90 Years
Malaysia
MAA

More Telugu News