లోక్‌సభ ఎన్నికల ఎఫెక్ట్.. తెలంగాణలో ముందుగానే ఈఏపీసెట్.. లేటుగా ఈసెట్
- షెడ్యూల్ ప్రకారం మే 9 నుంచి 12 వరకు టీఎస్ఈఏపీసెట్
- మే 13న తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మే 7 నుంచే పరీక్షలు మొదలు
- ఐసెట్ జూన్ 5, 6 తేదీలకు మార్పు
రాష్ట్రంలో మే 13 నుంచి లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల తేదీలను ప్రభుత్వం మార్పుచేసింది. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా.. మే 9, 10, 11 ఇంజనీరింగ్ తేదీల్లో నిర్వహించనున్నారు. అలాగే, జూన్ 4, 5 తేదీల్లో ఐసెట్ నిర్వహించాల్సి ఉండగా, జూన్ 4న పార్లమెంటు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఐసెట్‌ను జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు గమనించాలని కోరింది.