Anand Mahindra: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. సర్ఫరాజ్‌ఖాన్ తండ్రికి గిఫ్ట్‌గా థార్.. వీడియో ఇదిగో!

Anand Mahindra Gifts Thar To Team India Star Sarfaraz Khan Father
  • సర్ఫరాజ్‌ కోసం తండ్రి చేసిన త్యాగాలకు కరిగిపోయిన ఆనంద్ మహీంద్రా
  • థార్ బహుమతిగా ఇస్తానని ప్రకటించిన మహీంద్రా గ్రూప్ అధినేత
  • అరంగేట్ర టెస్టులోనే అదరగొట్టిన సర్ఫరాజ్

మహీంద్రా గ్రూప్ యజమాని ఆనంద్ మహీంద్రా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్‌ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్‌కు థార్ కారును బహుమతిగా అందించారు. కుమారుడు క్రికెటర్‌గా ఎదిగేందుకు నౌషద్‌ ఎన్నో త్యాగాలు చేశారు. సర్ఫరాజ్ టెస్ట్ మ్యాచ్ అరంగేట్రం తర్వాత నౌషద్‌కు థార్‌ను గిఫ్ట్‌గా ఇస్తానని ఆనంద్ మహీంద్రా ప్రకటించారు.

సర్ఫరాజ్‌పై బీసీసీఐ షేర్ చేసిన వీడియో చూసి కరిగిపోయిన ఆనంద్ మహీంద్రా థార్‌ను గిఫ్ట్‌గా ఇస్తానని ప్రకటించారు. సర్ఫరాజ్ అరంగేట్ర మ్యాచ్‌లోనే రికార్డు సృష్టించాడు. అత్యంత వేగంగా అర్ధ సెంచరీ నమోదు చేశాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ అర్ధ శతకాలు బాదాడు. తాజాగా ఆనంద్ మహీంద్రా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సర్ఫరాజ్ తండ్రికి థార్‌ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు.

  • Loading...

More Telugu News