K Keshav Rao: బీఆర్ఎస్ కీలక నేత కేకేను కలిసిన కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి

Congress leaders meet KK and Gadwala Vijayalaxmi
  • బంజారాహిల్స్‌లోని కేకే నివాసానికి వెళ్లిన దీపాదాస్ మున్షీ, వేం నరేందర్ రెడ్డి
  • భేటీలో కేకేతో పాటు కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి
  • దాదాపు నలభై నిమిషాల పాటు భేటీ అయిన నేతలు

కేసీఆర్‌కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. పార్టీలోని కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్, బీజేపీలలో చేరుతున్నారు. తాజాగా, మరో కీలక నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ శుక్రవారం బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు నివాసానికి వెళ్లారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

బంజారాహిల్స్‌లోని కేకే నివాసానికి దీపాదాస్ మున్షీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు వెళ్లారు. వీరు దాదాపు నలభై నిమిషాల పాటు కేకేతో మాట్లాడారు. ఈ చర్చల్లో కేకేతో పాటు ఆయన కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు. దీంతో కేకే, గద్వాల విజయలక్ష్మిలు పార్టీ మారుతారనే ఊహాగానాలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News