Chandrababu: ఎన్డీయేలో చేరడానికి కారణం ఇదే: చంద్రబాబు

TDP joined NDA for the interests of AP people says Chandrababu
  • నేడు మూడో జాబితా విడుదల చేసిన టీడీపీ
  • రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయేలో చేరామని వెల్లడి
  • ప్రజలారా దీవించండి అంటూ ట్వీట్
లోక్ సభ, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. 13 మంది పార్లమెంట్, 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ...  రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ఏకైక అజెండాగా ఎన్డీయేలో చేరామని చెప్పారు. పార్లమెంటులో బలమైన గళం వినిపిస్తూ... రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే అభ్యర్థులుగా నిలబెడుతున్నామని తెలిపారు. పార్లమెంటుకు పోటీ చేసే 13 మంది తెలుగుదేశం అభ్యర్థులను, వీరితో పాటు మరో 11 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రజాభిప్రాయం మేరకు ఎంపిక చేసి ప్రకటిస్తున్నామని చెప్పారు. ప్రజలారా దీవించండి అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు తాజా జాబితాలో బోడె ప్రసాద్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వసంత కృష్ణప్రసాద్, అయితాబత్తుల ఆనందరావు తదితరులకు అవకాశం దక్కింది.
Chandrababu
Telugudesam
NDA
AP Politics

More Telugu News