annamalai: బీజేపీ మూడో జాబితా విడుదల... చెన్నై సౌత్ నుంచి తమిళిసై, కోయంబత్తూర్ నుంచి అన్నామలై పోటీ

Annamalai from Coimbatore and Tamilisai from Chennai South
  • తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితా విడుదల
  • నీలగిరి నుంచి ఎల్ మురుగన్ పోటీ
  • కన్యాకుమారి నుంచి పోన్ రాధాకృష్ణన్ పోటీ

పార్లమెంట్ ఎన్నికల కోసం తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను బీజేపీ అధిష్ఠానం గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై తదితరుల పేర్లు ఉన్నాయి. మూడో జాబితాలో ప్రధానంగా తమిళనాడు నేతల పేర్లను ప్రకటించింది.

ఈ జాబితా ప్రకారం కోయంబత్తూర్ నుంచి అన్నామలై, చెన్నై సౌత్ నుంచి తమిళిసై సౌందరరాజన్, నీలగిరి నుంచి ఎల్ మురుగన్ పోటీ చేయనున్నారు. చెన్నై సెంట్రల్ నుంచి వినోజ్ సెల్వం, వేలూరు నుంచి ఏసీ షణ్ముగం, కృష్ణగిరి నుంచి సీ నరసింహన్, పెరంబలూరు నుంచి టీఆర్ పరివేందర్, తూత్తుకుడి నుంచి నైనార్ నాగేంద్రన్, కన్యాకుమారి నుంచి పొన్ రాధాకృష్ణన్ పోటీ చేయనున్నారు.

  • Loading...

More Telugu News