Jeevan Reddy: రైతుబంధుపై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Jeevan reddy hot comments on Rythu Bandhu
  • చెట్లు, గుట్టలు, పుట్టలు ఉంటే తాము రైతుబంధు ఇవ్వమని స్పష్టీకరణ
  • ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ పదేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? అని ప్రశ్న
  • ఓటు కోసం బీజేపీ నాయకులు వస్తే నిలదీయాలని పిలుపు
రైతుబంధుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ... చెట్లు, గుట్టలు, పుట్టలు ఉంటే తాము రైతుబంధు ఇవ్వమని స్పష్టం చేశారు. న్యాయంగా రైతుబంధు వచ్చిన వారు మాకు ఓటు వేయాలని కోరారు. బీజేపీపై జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఓటు కోసం  బీజేపీ నాయకులు వస్తే నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ గెలిస్తే అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని ప్రధాని మోదీ చెప్పారని... రూ.15 లక్షలు వచ్చిన వెంటనే బీజేపీకి ఓటు వేద్దామని... రాకుంటే మాత్రం కాంగ్రెస్‌కు వేయాలన్నారు.
Jeevan Reddy
Congress
Telangana
BJP

More Telugu News