Bengaluru: బెడ్ రూమ్ కిటికీ తెరిచి ఉంచుతున్నారంటూ పక్కింటి వాళ్లపై పోలీస్ కంప్లైంట్..!

Bengaluru woman claims neighbours keep window open during private moments
  • మనశ్శాంతి లేకుండా పోతోందంటూ బెంగళూరు మహిళ ఫిర్యాదు
  • కాస్త ఆ సమయంలో కిటికీ మూసేయండని విజ్ఞప్తి చేసినా వినలేదని ఆరోపణ
  • ఐపీసీ సెక్షన్ 504 కింద కేసు నమోదు చేసిన పోలీసులు
పక్కింటిలో ఉండే భార్యాభర్తలు బెడ్ రూం కిటికీని తెరిచి ఉంచుతున్నారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెడ్ రూమ్ లో వాళ్ల ప్రైవేట్ సంభాషణ, చప్పుళ్లను భరించలేకపోతున్నానని ఆరోపించింది. కాస్త ఆ సమయంలో కిటికీ మూసేయండని విజ్ఞప్తి చేసినా వినలేదంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయంలో ఇంటి యజమాని కూడా వారికే వత్తాసు పలుకుతున్నాడని చెప్పింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన వివరాలు..

బెంగళూరు సిటీలోని అవలహళ్లి బీడీఏ లే ఔట్ లో అద్దెకు ఉంటున్న ఓ మహిళ తన పొరుగింటి వారిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆ భార్యాభర్తల చేష్టలతో తనకు ఇంట్లో మనశ్శాంతి కరువైందని, వారు బెడ్ రూమ్ లో సన్నిహితంగా ఉన్నప్పుడు కిటికీ తెరిచి ఉంచుతున్నారని ఆరోపించింది. దీనిపై ఇంటి ఓనర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని చెప్పింది. దీంతో ‘మీరైనా కలగజేసుకుని నా సమస్యను పరిష్కరించండి’ అంటూ పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదుతో ఐపీసీ 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం, రెచ్చగొట్టడం) సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Bengaluru
Bedroom Window
Police case
Neighbours
Offbeat

More Telugu News