Amala Paul: కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న అమలాపాల్

Amala Paul to give birth to twins
  • జగత్ దేశాయ్ ని రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్
  • తల్లి కాబోతున్నట్టు ఇన్స్టా వేదికగా పోస్ట్
  • ప్రస్తుతం మూడు మలయాళ సినిమాలు చేస్తున్న అమలాపాల్
సినీ హీరోయిన్ అమలాపాల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్టు వెల్లడించింది. కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్టు ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. ఒక చిన్న పాపను ఎత్తుకున్న ఫొటోను షేర్ చేసింది. టూ హ్యాపీ కిడ్స్ అని క్యాప్షన్ పెట్టింది. అమలాపాల్ తొలుత తమిళ దర్శకుడు విజయ్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియదు. ఆ తర్వాత అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుంది. జగత్ దేశాయ్ ని పెళ్లాడింది. సినిమాల విషయానికి వస్తే అమలాపాల్ ప్రస్తుతం మూడు మలయాళ సినిమాలు చేస్తోంది. 

Amala Paul
Tollywood
Pregnant
Instagram

More Telugu News