మహ్మద్ షమీ స్థానంలో కొత్త ఆటగాడిని తీసుకున్న గుజరాత్ టైటాన్స్
- సందీప్ వారియర్ అనే కొత్త పేసర్‌ని తీసుకున్న గుజరాత్ టైటాన్స్
- మధుశంక స్థానంలో అండర్-19 వరల్డ్ కప్ హీరో క్వేనా మఫాకాను జట్టులోకి తీసుకున్న ముంబై ఇండియన్స్
- అధికారికంగా ప్రకటించిన ఐపీఎల్ పాలక మండలి
మధుశంక ఐపీఎల్ 2024 ఎడిషన్‌కు దూరమయ్యాడని ఐపీఎల్ పాలకమండలి నిర్ధారించింది. దిల్షాన్ మధుశంక గాయం కారణంగా తొలగాడని తెలిపింది. అతడి స్థానంలో తీసుకున్న క్వేనా మఫాకా దక్షిణాఫ్రికాకు చెందిన ఆటగాడని, ఎడమచేతి వాటం పేసర్ అని తెలిపింది. ఇటీవల ముగిసిన ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడని, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా కూడా ఎంపికయ్యాడని పేర్కొంది. బేస్ ధర రూ.50 లక్షల మొత్తానికి ముంబై ఇండియన్స్ అతడిని జట్టులో చేర్చుకుందని వివరించింది.