Congress: బీఆర్ఎస్‌కు మరో షాక్... కాంగ్రెస్‌లో చేరిన మహబూబ్ నగర్ జెడ్పీ చైర్ పర్సన్

Mahaboobnagar ZP Chairperson joins congress
  • సీఎం రేవంత్ రెడ్డి, వంశీచంద్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన స్వర్ణ సుధాకర్ రెడ్డి
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి
  • కొన్నిరోజులుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జోరుగా వలసలు

మహబూబ్ నగర్ జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డిల సమక్షంలో ఆమె కాంగ్రెస్ జెండాను కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇటీవల పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలలో చేరుతున్నారు. ఇటీవల పట్నం సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

  • Loading...

More Telugu News