ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం
- షుగర్ ఫ్యాక్టరీ మూతకు బీజేపీయే కారణమని మండిపాటు
- ప్రధాని నరేంద్ర మోదీ వేషం ఇప్పటికి రెండుసార్లు చూశామన్న కాంగ్రెస్ నేత
- జగిత్యాల సభలో మోదీ అన్నీ అబద్ధాలే చెప్పారన్న జీవన్ రెడ్డి
పదేళ్లు అధికారంలో ఉన్నది మీరే కదా... మళ్లీ ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని అంటారేమిటని నిలదీశారు. ఇన్నాళ్ళు షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు ఓపెన్ చేయలేదో చెప్పాలన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అయిదేళ్లు ఏం చేశారు? అని ప్రశ్నించారు.