Papad Making: కాళ్లతో తొక్కుతూ పాపడ్ తయారీ.. వీడియో వైరల్

Papad Making Process Sparks Hygiene Debate On The Internet
  • అపరిశుభ్రంగా దేశీ పాపడ్స్ తయారీ
  • మండిపడుతున్న నెటిజన్లు
  • ఫాస్ట్ ఫుడ్ కంటే ఇది మేలేనంటున్న పలువురు

అపరిశుభ్ర వాతావరణంలో దేశీ పాపడ్ తయారుచేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన పాపడ్ లవర్స్ కంగుతిన్నారు. పాపడ్ తయారుచేస్తున్న పరిసరాలు అపరిశుభ్రంగా కనిపించడంతో పాటు కాళ్లతో తొక్కుతూ పాపడ్ కట్ చేయడం చూసి తీవ్రంగా మండిపడుతున్నారు. ఇన్ స్టాలో వైరల్ గా మారిన ఈ వీడియోను దబాకే ఖావో అనే యూజర్ పోస్ట్ చేశారు. ఇందులో పాపడ్ తయారీ విధానం.. పిండి కలపడం దగ్గరి నుంచి పాపడ్ ను విడివిడిగా తీసి ఎండబెట్టడం దాకా ఈ వీడియోలో చూపించారు.

పాపడ్ తయారీలో భాగంగా ఓ మహిళ భారీ పాప‌డ్ షీట్స్‌ను గుండ్ర‌టి ఆకారంలో క‌ట్ చేసేందుకు స్టీల్ గిన్నెను ఉపయోగిస్తుంది. పాపడ్ షీట్స్ పై ఆ గిన్నెను బోర్లించి, దానిని కాలితో బలంగా తొక్కడం వీడియోలో చూడొచ్చు. ఆపై వాటిని విడదీసి ఎండ‌లో ఆరబెట్టి ప్యాక్ చేస్తారు. అయితే, కాలితో పాప‌డ్‌ షీట్లను తొక్కడంపై సోషల్ మీడియా యూజర్లు మండిపడుతున్నారు. ఇదేం పనంటూ కోపంగా కామెంట్లు పెడుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం ప్రస్తుతం బయట తయారుచేసే ఫాస్ట్ ఫుడ్ కంటే ఇదేమంత ఘోరం కాదులెమ్మని కామెంట్ చేశారు. కాగా, ఈ పాపడ్ తయారీ వీడియో ఎక్కడిదనే వివరాలు తెలియరాలేదు.

View this post on Instagram

A post shared by Akola ka Foodie (@dabake_khao)

  • Loading...

More Telugu News