Smriti Mandhana: బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి ట్రోఫీతో ఫొటోల‌కు పోజిచ్చిన స్మృతి మంధాన‌.. నెట్టింట‌ ఫొటోల వైర‌ల్‌!

Smriti Mandhana Posing With Rumoured Boyfriend Palash Muchhal After RCB Win WPL 2024
  • డ‌బ్ల్యూపీఎల్ రెండో సీజ‌న్ విజేత‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు
  • విజ‌యాన్ని గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకున్న బెంగ‌ళూరు ప్లేయ‌ర్లు
  • సెల‌బ్రేష‌న్స్‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన‌ కెప్టెన్ స్మృతి మంధాన 
  • బాయ్‌ఫ్రెండ్ ప‌లాస్ ముచ్చ‌ల్‌తో క‌లిసి ఫొటోల‌కు పోజులు
మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌) రెండో సీజ‌న్ విజేత‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నిలిచిన విష‌యం తెలిసిందే. ఫైన‌ల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను మ‌ట్టిక‌రిపించి స్మృతి మంధాన సేన టైటిల్ గెలిచింది. ఇక టైటిల్ గెలిచిన త‌ర్వాత బెంగ‌ళూరు ప్లేయ‌ర్లు గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఈ సెల‌బ్రేష‌న్స్‌లో కెప్టెన్ స్మృతి మంధాన అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఎందుకంటే ఆమె ఈ సెల‌బ్రేష‌న్స్‌లో త‌న బాయ్‌ఫ్రెండ్ ప‌లాస్ ముచ్చ‌ల్‌తో క‌నిపించింది. అత‌నితో క‌లిసి ట్రోఫీతో ఫొటోల‌కు పోజులు కూడా ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ల‌వ్‌బ‌ర్డ్స్ తాలూకు ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

కాగా, బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఉన్న ప‌లాస్ ముచ్చ‌ల్‌తో స్మృతి గ‌త కొంత‌కాలంగా స‌హ‌జీవ‌నం చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఓ ఈవెంట్ సంద‌ర్భంగా వీరి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. దీంతో ఇప్పుడీ జంట పీక‌ల‌లోతు ప్రేమ‌లో మునిగి తేలుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక బెంగ‌ళూరు డ‌బ్ల్యూపీఎల్ రెండో సీజ‌న్‌ విజేత‌గా నిల‌వ‌డంతో ఆ జ‌ట్టుపై ప్ర‌శంస‌లు వెల్లువెత్తున్నాయి. ఆర్‌సీబీ అభిమానులు పురుషుల జ‌ట్టు కూడా ఈసారి ఐపీఎల్‌ టైటిల్ సాధించాల‌ని కోరుకుంటున్నారు.
Smriti Mandhana
Boyfriend
Palash Muchhal
RCB
WPL 2024
Cricket
Sports News

More Telugu News