నేడు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ భేటీ.. తెలంగాణలో మిగతా 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక
- ఇప్పటికే నాలుగు స్థానాలు ప్రకటించిన కాంగ్రెస్
- నేడు ఎంపిక చేసి రేపు ప్రకటించనున్న సీఈసీ
- వలస నేతలకూ టికెట్లు!
ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశంలో అభ్యర్థులను ఫైనల్ చేసి రేపు ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నేతలు వలస వస్తున్న నేపథ్యంలో వారిలో బలమైన అభ్యర్థులకు టికెట్లు కేటాయించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైనట్టు సమాచారం.