రష్యా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్
- 87.97 శాతం ఓట్లతో విజయం
- పుతిన్‌పై పోటీకి దిగిన స్నేహపూర్వక పార్టీల అభ్యర్థులు
- ఉక్రెయిన్ యుద్ధంపై, పుతిన్‌పై ఒక్క విమర్శ కూడా చేయని వైనం
అత్యంత కఠినమైన ఆంక్షల మధ్య ఈ ఎన్నికలు జరిగాయి. ఉక్రెయిన్ యుద్ధం, పుతిన్‌పై బహిరంగ విమర్శలు చేయకుండా ఆంక్షలు విధించారు. పుతిన్‌కు రాజకీయ శత్రువైన అలెక్సీ నవల్నీ గత నెలలో చనిపోయిన నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి. ఇక పుతిన్‌ను విమర్శించిన వారిలో చాలా మంది జైలులో ఉండగా.. కొందరు విదేశాల్లో తలదాచుకుంటున్నారు.