Anchor Shyamala: మగదిక్కు లేని మాకు అండగా ఉంటాననేవాడు: యాంకర్ శ్యామల

Anchor shyamala opens about during early days in the industry
  • ఇండస్ట్రీలోకొచ్చిన తొలి రోజుల్లో ఇబ్బందుల గురించి చెప్పిన యాంకర్ శ్యామల
  • లవ్‌ ప్రపోజల్స్‌తో పదే పదే ఇబ్బంది పెట్టేవాళ్లని ఆవేదన
  • ఓ కెమెరామెన్ అర్ధరాత్రి ఫోన్ చేసి విసిగించేవాడని వెల్లడి
బుల్లితెర నటిగా, ఆ తరువాత యాంకర్‌గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శ్యామల తన కెరీర్‌ తొలినాళ్లల్లో ఎదుర్కొన్న వేధింపుల గురించి తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 

‘‘సినిమాల్లో నటించాలన్న కోరికతో నేను మా అమ్మతో కలిసి హైదరాబాద్‌కు వచ్చాను. ముందుగా సీరియల్స్‌లో అవకాశాలు వస్తే నటించాను. ఆ సమయంలో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి. షూటింగ్‌లో కొందరు నన్ను విసిగించేవారు. లవ్ ప్రపోజల్స్ పెట్టి పదే పదే ఇబ్బంది పెట్టేవారు. అవన్నీ నేను తట్టుకోలేక సైన్ చేసిన మూడు సీరియల్స్‌లో నటించి ఊరికి వెళ్లిపోదామనుకున్నాను’’ 

‘‘ఆ సమయంలో ఓ కెమెరామెన్ బాగా వేధించేవాడు. అర్ధరాత్రి ఫోన్లు చేసి దారుణంగా మాట్లాడి చిరాకు తెప్పించేవాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫోన్ మా అమ్మ లిఫ్ట్ చేసింది. అప్పుడు అతడు మీకు మగ దిక్కు లేదు కదా మీ కోసం ఏమైనా చేస్తాను. మీ కూతురికి ఆ విషయం అర్థం కావడం లేదు. నేను ఎంత చెప్పినా వినడం లేదు. నేను చెప్పిన దానికి ఒప్పుకోకుంటే ఏదైనా చేయడానికి వెనకాడను అని అన్నాడు. దీంతో, మా అమ్మ అతడు ఏదైనా హానీ చేస్తాడేమోనని భయపడిపోయింది. ఇక్కడి నుంచి వెళ్లిపోదామని చెప్పింది. కానీ నేను ‘అలాంటివి పట్టించుకోకు నాకేం కాదు’ అని ధైర్యంగా ఉండమని చెప్పారు’’ అని చెప్పింది. దీంతో, శ్యామల కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 



Anchor Shyamala
Tollywood

More Telugu News