K Kavitha: కవితను ఢిల్లీకి తీసుకువెళ్లడానికి రాత్రి 8.45 గంటల ఫ్లైట్‌లో టిక్కెట్లు బుక్ చేసిన ఈడీ

ED officials to take kavitha delhi tonight
  • కవితను అరెస్ట్ చేసినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన ఈడీ
  • కాసేపట్లో శంషాబాద్ విమానాశ్రయానికి తరలింపు
  • ఈ కేసులో మరికొందరు బీఆర్ఎస్ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం
మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తీసుకు వెళ్లడానికి ఈ రోజు రాత్రి 8.45 గంటల ఫ్లైట్‌లో టిక్కెట్లు బుక్ చేశారు. కవితను అరెస్ట్ చేసినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ రోజు రాత్రి ఆమెను ఢిల్లీకి తరలించనున్నారు. కాసేపట్లో కవితను శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకు వెళ్లి... అక్కడి నుంచి ఢిల్లీకి తరలిస్తారు. 

మరోపక్క, ఈ కేసులో మరికొందరు బీఆర్ఎస్ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక, కవిత అరెస్ట్ విషయం తెలిసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భారత జాగృతి కార్యకర్తలు ఆమె నివాసానికి చేరుకున్నారు. ఈడీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవిత నివాసానికి మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు వచ్చారు.
K Kavitha
ed
Telangana
BRS

More Telugu News