హైదరాబాద్ లో కొనసాగుతున్న మోదీ రోడ్ షో
- మల్కాజ్ గిరి నియోజకవర్గంలో మోదీ రోడ్ షో
- మీర్జాలగూడ నుంచి మల్కాజ్ గిరి వరకు రోడ్ షో
- రోడ్ షోలో పాల్గొన్న కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్
రోడ్ షో కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఆ ప్రాంతమంతా భారత్ మాతాకీ జై నినాదాలతో మారుమోగుతోంది. ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ బీజేపీ శ్రేణులు నినదిస్తున్నారు. మోదీ రోడ్ షో సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రోడ్ షో తర్వాత రాజ్ భవన్ కు చేరుకుంటారు. ఈ రాత్రికి ఆయన రాజ్ భవన్ లోనే బస చేస్తారు.