Jakkampudi Raja: ​పవన్ కు ప్రజలే బుద్ధి చెబుతారు: జక్కంపూడి రాజా

YCP MLA Jakkampudi Raja take a dig at Pawan Kalyan
  • పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలేదన్న రాజా
  • చంద్రబాబును సీఎం చేయాలని ప్రయత్నిస్తున్నాడని విమర్శ  
  • ఇలాంటి వారిని ప్రజలు క్షమించడానికి సిద్ధంగా లేరని వ్యాఖ్యలు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆలోచనా విధానం సరిగాలేదని వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. ఎవరైనా పార్టీ పెట్టినప్పుడు, తన పార్టీ అధికారంలోకి రావాలని ఆశిస్తారని, తాను ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారని అన్నారు. కానీ పవన్ అందుకు భిన్నంగా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని ప్రయత్నిస్తున్నాడని, టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పనిచేస్తున్నాడని అన్నారు. 

"పవన్ కల్యాణ్ సినీ రంగానికి చెందిన వ్యక్తి. పది మందిని ఆకర్షించే అవకాశం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని ఆశించిన వాళ్లకు కూడా, ఇవాళ పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటివి క్షమించడానికి ప్రజలు ఎంతమాత్రం సిద్ధంగా లేరు... ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెబుతారు" అని జక్కంపూడి రాజా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News