భారత మార్కెట్‌లో ‘2024 హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్’ కారు ఆవిష్కరణ
- బాహ్య ప్రధాన మార్పులతో మార్కెట్‌లో విడుదల
- కారు ప్రారంభ ధర రూ. 16.82 లక్షలు.. గరిష్ఠ ధర రూ. 20.30 లక్షలు
- రూ.25000 టోకెన్ ధరతో బుకింగ్ అవకాశం ఉందని తెలిపిన హ్యుందాయ్ కంపెనీ
2024 హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ ప్రత్యేకతలు ఇవే
2024 హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ కారు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో తయారు చేశారు. ఈ ఇంజన్ 160హెచ్‌పీ గరిష్ఠ శక్తి, 253ఎన్ఎం గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుందని వివరించింది. ఇంజన్‌ను 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌తో అనుసంధానించినట్టు వెల్లడించింది. భద్రత విషయానికి వస్తే.. వెనుక డిస్క్ బ్రేక్‌లు, 360-డిగ్రీ కెమెరాలు, బ్లైండ్-స్పాట్ మోనిటర్లు, టైర్ ప్రెజర్ మానిటర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, లెవెల్ 2 అడాస్ టెక్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు మరిన్ని సౌకర్యాలు ఉన్నాయి. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 8-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్, డ్యూయల్ డాష్ క్యామ్ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి.