Revanth Reddy: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను ఖరారు చేస్తూ కేబినెట్ తీర్మానం

Cabinet resolution finalizing the names of Kodandaram and Aamir Ali Khan as MLCs
  • హైకోర్టు ఆదేశాలతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అభ్యర్థుల పేర్లపై మరోసారి తీర్మానం 
  • ఈ రెండు పేర్లను తిరిగి గవర్నర్ ఆమోదానికి పంపనున్న ప్రభుత్వం
  • రేవంత్ రెడ్డి కేబినెట్లో కోదండరాంకు చోటు?

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను ఖరారు చేస్తూ తెలంగాణ కేబినెట్ మంగళవారం తీర్మానం చేసింది. హైకోర్టు ఆదేశాలతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అభ్యర్థుల పేర్లను మరోసారి తీర్మానం చేసింది. ఈ రెండు పేర్లను తిరిగి గవర్నర్ ఆమోదం కోసం పంపించనున్నారు. కాగా, కోదండరాంకు కేబినెట్లో చోటు దక్కవచ్చునని ప్రచారం సాగుతోంది.

ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో రేవంత్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. అంతకుముందు ప్రభుత్వం సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదని, అభ్యంతరం ఉంటే రాష్ట్ర మంత్రి వర్గానికి తిప్పి పంపాలని పేర్కొంది. ఈ క్రమంలో మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్సీలను ఖరారు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది.

  • Loading...

More Telugu News