Raghu Rama Krishna Raju: సజ్జల, పిల్ల సజ్జల నెంబర్లు నా దగ్గర ఉన్నాయి: రఘురామకృష్ణరాజు

I have numbers of Sajjala and his son says Raghu Rama Krishna Raju
  • పేటీఎం బ్యాచ్ తో అసభ్యంగా బెదిరిస్తున్నారని మండిపాటు
  • చంద్రబాబు డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చారని ప్రశంస
  • వాలంటీర్లు విధులు సక్రమంగా నిర్వహించాలని సూచన

పేటీఎం బ్యాచ్ ద్వారా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు అసభ్యంగా బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తన దగ్గర కూడా సజ్జల, పిల్ల సజ్జల, ఇతరుల నంబర్లు ఉన్నాయని... తాను కూడా వారి మాదిరే చేయొచ్చని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల్లో స్వేచ్ఛగా రైతులు తమ పంటను అమ్ముకునే పరిస్థితి లేదని... వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను రైతు టోకరా కేంద్రాలుగా మార్చేసిందని విమర్శించారు. రైతులు అమ్ముకున్న పంటకు వెంటనే డబ్బులు చెల్లించడం లేదని... కొన్ని చోట్ల మూడు నెలలకు డబ్బులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. 

చంద్రబాబు హయాంలో రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చారని...అప్పుడు పంటలు బాగా పండేవని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించిందని రఘురాజు చెప్పారు. జగన్ పాలనలో ప్రతి ఒక్కరూ మోసానికి గురయ్యారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తాను ఒక విన్నపం చేస్తున్నానని... వచ్చే ప్రభుత్వంలో రైతులకు స్వేచ్ఛను ఇవ్వాలని అన్నారు. రైతులకు సంబంధించిన అంశాలను మేనిఫెస్టోలో ఉంచాలని కోరారు. జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు కూడా చెప్పారని తెలిపారు. వాలంటీర్లు విధులు సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. ఎన్నికల్లో డబ్బులు పంచే కార్యక్రమంలో పాలుపంచుకోవద్దని సూచించారు.  

  • Loading...

More Telugu News