Gutha Sukender Reddy: సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యసలహాదారుతో గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడి భేటీ

Gutha Sukender Reddy son meets Vem Narender Reddy
  • మంగళవారం మధ్యాహ్నం వేం నరేందర్ రెడ్డితో సమావేశమైన గుత్తా అమిత్ రెడ్డి
  • బీఆర్ఎస్ నుంచి నల్గొండ లేదా భువనగిరి లోక్ సభకు పోటీ చేయాలనుకున్న అమిత్ రెడ్డి
  • ఆ తర్వాత పోటీపై వెనక్కి వెళ్లిన గుత్తా అమిత్ రెడ్డి
  • కాంగ్రెస్‌లో చేరుతారని జోరుగా ప్రచారం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యసలహాదారు వేం నరేందర్ రెడ్డితో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం వేం నరేందర్ రెడ్డిని ఆయన కలిశారు. గుత్తా అమిత్ రెడ్డి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున నల్గొండ లోక్ సభ లేదా భువనగిరి లోక్ సభ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ తర్వాత బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడంపై వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి భువనగిరి టిక్కెట్‌ను ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Gutha Sukender Reddy
Revanth Reddy
Congress
BRS

More Telugu News