Lakshmi Parvati: చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు పలకడు: లక్ష్మీపార్వతి

Lakshmi Parvati talks about
  • ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ-జనసేన
  • ఈ పొత్తు అనైతికం అన్న లక్ష్మీపార్వతి
  • అమిత్ షా ఇంటి ముందు చంద్రబాబు శివరాత్రి జాగారం చేశారని ఎద్దేవా 
  • వరుణ్ తేజ్ ప్రచారం చేసినా కూటమికి ఓట్లు పడవని స్పష్టీకరణ 

వైసీపీ మహిళా నేత, రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తు అనైతికం అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో అమిత్ షా ఇంటి ముందు చంద్రబాబు శివరాత్రి జాగారం చేసి పొత్తులకు ఒప్పించారని ఎత్తిపొడిచారు. ఎవరు ఎన్ని పొత్తులతో వచ్చినా జగన్ ను ఓడించలేరని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. 

వరుణ్ తేజ్ ప్రచారం చేసినా కూటమికి ఓట్లు పడవని అన్నారు. వారు రీల్ హీరోలు మాత్రమే... రియల్ హీరోలు కాదు అని వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి అని, ఆయన చంద్రబాబుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు పలకడు అని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News