Sai Durga Tej: మేనమామల ఆశీస్సులతో... తల్లి పేరిట ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన సాయి దుర్గా తేజ్

Sai Durga Tej starts production house
  • ప్రొడక్షన్ రంగంలో కాలుమోపిన మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్
  • విజయదుర్గ ప్రొడక్షన్స్ కు ప్రారంభోత్సవం
  • తొలి చిత్రంగా 'సత్య'

మెగా హీరో సాయి దుర్గా తేజ్ (సాయిధరమ్ తేజ్ పేరు మార్చుకున్నారు) సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. తల్లి విజయదుర్గ పేరిట విజయదుర్గ ప్రొడక్షన్స్ సంస్థను ప్రారంభించారు. ఇది ఒక కొత్త ప్రారంభం అని సాయి దుర్గా తేజ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. 

"మా అమ్మ పేరు మీద విజయదుర్గ ప్రాడక్షన్స్ సంస్థను స్థాపించాను. అమ్మకు ఇదొక చిన్న కానుక. మా చిరంజీవి మామయ్య, నాగబాబు మామయ్య, పవన్ కల్యాణ్ మామయ్యల ఆశీస్సులతో చిత్ర నిర్మాణ రంగంలో కాలుమోపాను. నా కెరీర్ తొలినాళ్లలో తోడ్పాటు అందించిన నిర్మాత దిల్ రాజు గారు కూడా దీవెనలు అందజేశారు. నా స్నేహితుల సహకారంతో రూపొందించిన 'సత్య' చిత్రాన్ని మా ప్రొడక్షన్ సంస్థ ద్వారా తీసుకువస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని సాయి దుర్గా తేజ్ వివరించారు.
Sai Durga Tej
Vijayadurga Productions
Vijayadurga
Tollywood

More Telugu News