Sai Durga Tej: తన పేరులో మార్పు చేసిన మెగా మేనల్లుడు

Sai Tej added Durga to his name
  • ఇవాళ మహిళా దినోత్సవం
  • తన పేరులో తల్లి పేరు దుర్గను చేర్చుకుంటున్నానన్న సాయిధరమ్ తేజ్ 
  • ఇక నుంచి తన పేరు సాయి దుర్గా తేజ్ అని వివరణ

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తాజాగా ఆయన తన పేరులో మార్పు చేసుకున్నారు. తన తల్లి విజయదుర్గ పేరులోని దుర్గ అనే పదాన్ని తన పేరు మధ్యలో చేర్చుకున్నారు. ఇక నుంచి తన పేరు 'సాయి దుర్గా తేజ్' అని వివరించారు. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. 

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో తాను, స్వాతి కలిసి నటించిన ఓ కాన్సెప్ట్ ఫిలిం స్పెషల్ స్క్రీనింగ్ కు సాయిధరమ్ తేజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగానే తన పేరు మార్పుపై ప్రకటన చేశారు. తండ్రి పేరు ఎలాగూ ఇంటి పేరులో వచ్చేస్తుందని, తల్లి పేరు కూడా తన పేరులో ఉండాలన్న ఉద్దేశంతో 'దుర్గ' అనే పేరును చేర్చుకుంటున్నానని వివరించారు.

  • Loading...

More Telugu News