తండ్రయిన టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. సోషల్ మీడియా వేదికగా వెల్లడి
- హీరో శర్వానంద్‌కు పండంటి పాప
- చిన్నారికి లీలా దేవీ మైనేనిగా నామకరణం
- గతేడాది జూన్‌లో రక్షితారెడ్డిని పెళ్లాడిన శర్వా
ఇక శర్వానంద్ ఇవాళ తన బర్త్‌డే సందర్భంగా తాను నటిస్తున్న మూడు కొత్త సినిమాల అప్‌డేట్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. వాటిలో ఒకటి చివరి షెడ్యూల్‌లో ఉండగా.. మరో రెండు సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. ఇక ఈ మూడు సినిమాల్లో కూడా శర్వానంద్ మూడు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించనున్నారు. శర్వా తన 35వ సినిమాని టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో చేస్తున్నాడు. ఈ మూవీలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ‘మనమే’ అనే క్లాసీ టైటిల్‌ను ఖరారు చేశారు.
ఇక అతని 36వ చిత్రం యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కనుంది. ఈ మూవీకి అభిలాష్ రెడ్డి కంకర దర్శకుడు. ఇందులో శర్వా సరసన మాళవిక నాయర్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే 37వ ప్రాజెక్ట్‌ని ‘సామజవరగమన’ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చేయబోతున్నారు.