Ambani Event: మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకకు అంబానీ ఎంత ఖర్చు పెట్టారంటే..!

Mukesh Ambani Spent Huge Amount For Anant Ambani Radhika pre wedding Event
  • భోజన ఖర్చు రూ.200 కోట్ల పైమాటే
  • రిహానా ప్రదర్శనకు అక్షరాలా రూ. 52 కోట్ల చెల్లింపు
  • అట్టహాసంగా జరిగిన వేడుకలకు మొత్తంగా రూ.1260 కోట్ల ఖర్చని అంచనా
అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. గుజరాత్ లోని జామ్ నగర్ లో మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి సెలబ్రెటీలు హాజరయ్యారు. అతిథులకు ఏర్పాట్లతో పాటు వేడుక కోసం ప్రత్యేకంగా సెట్టింగ్ లు వేయించి మరీ ఈ వేడుకను నిర్వహించారు. అన్నదానంతో మొదలైన వేడుకలకు హస్తాక్షర్ తో ముగింపు పలికారు. అయితే, ఈ వేడుక కోసం అంబానీ ఎంత ఖర్చు చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. 

మూడు రోజుల ఈ వేడుకలో భోజనాల ఖర్చే రూ.200 కోట్ల పైచిలుకు అని తెలిసింది. అతిథులకు వందలాది రుచులను పరిచయం చేస్తూ సిద్ధం చేసిన మెనూకు అంబానీ భారీ మొత్తం వెచ్చించారట. ఇక ఈ వేడుకలో రెండు గంటలపాటు ఆడిపాడినందుకు పాప్ సింగర్ రిహానాకు ఏకంగా రూ.52 కోట్లు చెల్లించారట. సినిమా సెట్టింగ్ లను తలపించేలా వేసిన సెట్టింగులు, అతిథుల కోసం ఫైవ్ స్టార్ హోటల్ ను మరిపించేలా చేసిన ఏర్పాట్లకు.. మొత్తంగా కలిపి ఈ వేడుకకు ముఖేశ్ అంబానీ అక్షరాలా రూ.1260 కోట్లు ఖర్చు పెట్టాడని ఒక అంచనా.. వాస్తవంలో ఇంకా ఎక్కువే అయి ఉండొచ్చని సమాచారం.
Ambani Event
Pre wedding Cost
Mukesh Ambani
Food Cost
Pre wedding
Offbeat

More Telugu News