Narendra Modi: ట్విన్స్ పుడితే చూడకుండా మోదీని కలిసేందుకు విమానాశ్రయానికి.. కార్యకర్తపై ప్రధాని పోస్టు వైరల్

PM Modi gets emotional as BJP worker receives him before seeing his newborns
  • నిన్న చెన్నై‌లో ల్యాండ్ అయిన ప్రధాని మోదీ
  • కలిసేందుకు వెళ్లిన కార్యకర్త అశ్వంత్ పిజై
  • పార్టీలో ఇలాంటి అంకితభావం కలిగిన కార్యకర్తలు ఉన్నారని మోదీ ప్రశంస
  • ఇది చాలా ప్రత్యేకమైన ఇంటరాక్షన్ అంటూ మోదీ పోస్ట్
  • ఆయనకు, ఆయన కుటుంబానికి మోదీ ఆశీస్సులు  
బీజేపీ కార్యకర్త ఒకరు చేసిన పనికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫిదా అయ్యారు. సోమవారం ఇద్దరు ట్విన్స్‌కు తండ్రి అయిన ఆ కార్యకర్త పిల్లలను చూడడానికి ముందు చెన్నై విమానాశ్రయానికి వెళ్లి మోదీని కలిశారు. విషయం తెలిసిన ప్రధాని సోషల్ మీడియా పోస్టులో కార్యకర్తపై ప్రశంసలు కురిపించారు. అంకితభావంతో కూడిన ఇలాంటి కార్యకర్తలు పార్టీలో ఉన్నారని కొనియాడారు.

‘‘ఇది చాలా ప్రత్యేకమైన ఇంటరాక్షన్. చెన్నై విమానాశ్రయంలో మా కార్యకర్తల్లో ఒకరైన శ్రీ అశ్వంత్ పిజై జీ నాకు స్వాగతం పలికేందుకు వచ్చారు. ఆయన భార్య ఇప్పుడే కవలలకు జన్మనిచ్చింది. అయినప్పటికీ వారిని ఇంకా కలవలేదని చెప్పాడు. అయితే, ఇక్కడకు వచ్చి ఉండకూడదని ఆయనకు చెప్పాను. ఆయనకు, ఆయన కుటుంబానికి నా ఆశీర్వాదాలు తెలియజేశాను’’ అంటూ తమిళంలో ‘ఎక్స్’ చేశారు.
Narendra Modi
Chennai Airport
Aswanth Pijai
BJP

More Telugu News