Narendra Modi: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మోదీ, యోగిని చంపేస్తా.. కర్ణాటక వ్యక్తి వార్నింగ్

Will kill Modi and Yogi if Congress come to power in centre Karnataka man warns
  • సెల్ఫీ వీడియోలో హెచ్చరికలు జారీచేసిన మొహమ్మద్ రసూల్
  • చేతిలో పదునైన ఆయుధం పట్టుకుని దుర్భాషలు  
  • నిందితుడుని హైదరాబాద్‌లో దినసరి కూలీగా గుర్తించిన పోలీసులు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ కనుక కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానంటూ కర్ణాటక‌లోని యాదగిరి జిల్లాకు చెందిన వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. నిందితుడిని జిల్లాలోని రంగంపేటకు చెందిన మొహమ్మద్ రసూల్ కడారేగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మోదీ, ఆదిత్యనాథ్‌ను రసూల్‌ బెదిరిస్తూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఆ వీడియోలో అతడు మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మోదీ, సీఎం యోగిని చంపేస్తానని తీవ్రంగా హెచ్చరించాడు. అతడి చేతిలో పదునైన ఆయుధం ఉండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అది సెల్ఫీ వీడియో అని, నిందితుడు ఆ వీడియోలో మోదీ, ఆదిత్యనాథ్‌ను దుర్భాషలాడాడని పోలీసులు తెలిపారు.  కాగా, రసూల్ హైదరాబాద్‌లో దినసరి కూలీగా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
Narendra Modi
Yogi Adityanath
Threats
Mohammed Rasool Kaddare
Congress
Karnataka

More Telugu News