West Africa: పశ్చిమ ఆఫ్రికాలో భారతీయ దంపతుల మృతి

Indian couple dies in West Africa and Indian Embassy confirms
  • అబిద్జాన్‌లో చనిపోయిన సంజయ్ గోయెల్, అతడి భార్య సంతోష్ గోయెల్
  • నిర్ధారిస్తూ ఎక్స్ వేదికగా ప్రకటన చేసిన భారత రాయబార కార్యాలయం
  • మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడి
పశ్చిమ ఆఫ్రికాలోని అబిద్జాన్‌లో ఓ భారతీయ దంపతుల జంట కన్నుమూసింది. సంజయ్ గోయెల్, అతడి భార్య సంతోష్ గోయెల్ మరణించినట్లు కోట్‌డి ఐవరీలోని భారత రాయబార కార్యాలయం నిర్ధారించింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా కీలక ప్రకటన విడుదల చేసింది. దంపతుల మృతదేహాలను స్వదేశానికి పంపించడానికి స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది. మృతదేహాలను వీలైనంత త్వరగా భారత్‌కు తరలింపునకు ప్రయత్నిస్తున్నట్టు రాయబార కార్యాలయం వివరించింది. దంపతుల మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు స్థానిక అధికారుల దర్యాప్తును ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొంది. ఈ మేరకు స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నట్టు పేర్కొంది.

కాగా దంపతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. కష్టకాలంలో కుటుంబ సభ్యులకు అన్ని విధాలా సాయంగా నిలుస్తామని హామీ ఇచ్చింది.
West Africa
Indian Embassy
Indian Couple died
Abidjan

More Telugu News