కాళేశ్వరం ప్రాజెక్టు సురక్షితం కాదు... కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్
- లక్ష కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పెద్దపల్లి, భూపాలపల్లి ప్రాంతాల్లో ఒక్క చుక్క నీరు రాలేదని విమర్శ
- మేడిగడ్డకు మరమ్మతులు నిపుణుల సూచనల మేరకు జరుగుతాయన్న మంత్రి
- ఎవరి సలహాలపైనో మరమ్మతులు చేపడితే ప్రాజెక్టు మళ్లీ కుంగిపోతుందన్న శ్రీధర్ బాబు
మేడిగడ్డకు మరమ్మతులు నిపుణుల సూచనల మేరకు జరుగుతాయన్నారు. వాళ్లు చెప్పారనో... వీళ్లు చెప్పారనో... అలాంటి వారి సలహాలపై మరమ్మతులు చేపడితే ప్రాజెక్టు మళ్లీ కుంగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజినీర్లు, నిపుణుల సూచనల కోసం తమ ప్రభుత్వం వేచి చూస్తోందన్నారు. తాము అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా పూర్తి కాలేదని, కానీ అప్పుడే ఆరు గ్యారెంటీల్లో పలు హామీలను అమలు చేసినట్లు తెలిపారు. హామీలు అమలు చేసిన విషయం బీఆర్ఎస్ నేతల కళ్లకు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.